iPhone Duo: రూ. 3 లక్షల యాపిల్ ఫోల్డబుల్ ఫోన్.. మొదటి రోజే స్క్రీన్ సమస్యల ఫిర్యాదులు

iPhone Duo: రూ. 3 లక్షల యాపిల్ ఫోల్డబుల్ ఫోన్.. మొదటి రోజే స్క్రీన్ సమస్యల ఫిర్యాదులు

యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యూయో రూ. 3 లక్షల ధరతో భారత్‌లో లాంచ్ కాగా, మొదటి రోజే స్క్రీన్ పగుళ్లు, డిస్‌ప్లే సమస్యలు వస్తున్నాయని యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు. యాపిల్ ఐఫోన్ డ్యూయో iPhone మోడళ్లలో ఇదే అత్యంత ఖరీదైనది. ఫోల్డబుల్ స్క్రీన్‌తో వచ్చిన మొట్టమొదటి iPhone కావడంతో, మార్కెట్లో విడుదలకు ముందు నుంచే వినియోగదారుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ అంచనాలు పూర్తిగా వమ్ముయ్యాయని యూజర్లు వాపోతున్నారు. 

ఫోన్ కొనుగోలు చేసిన కొంతమంది యూజర్లు సోషల్ మీడియాలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొన్ని గంటలు, కొన్ని రోజుల వినియోగంలోనే మధ్యలోని హింజ్ భాగం చుట్టూ స్క్రీన్ పగుళ్లు, వెలుతురు లైన్స్, డిస్ ప్లే ఫెయిలవడం వంటి సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు.  మొదటి రోజే మధ్య భాగం పని చేయడం ఆగిపోయిందని అన్ని డబ్బులు పోసి కొన్నందుకు ఫలితం లేకుండా కొంతమంది లోపాలను హైలైట్ చేశారు. 

వినియోగదారుల అనుభవంపై ఎంతో శ్రద్ధ పెట్టే కంపెనీగా పేరున్న యాపిల్‌కు ఇటువంటి ఫిర్యాదులు రావడం, రూ.3 లక్షల పైగా వెచ్చించిన వినియోగదారులు ఇలాంటి సమస్యలు ఎదుర్కొనడం కంపెనీ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. 

ALSO READ : ఏఐ కోసం భారీగా ఖర్చు: 60 వేల మంది ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ బైఔట్ ఆఫర్.. 

గత కొన్ని వారాలుగా ప్రీమియం వర్గాలు ఈ ఫోన్ పై ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో డ్యూరాబిలిటీ సమస్యలు iPhone Duo విక్రయాలపై మరింత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. వినియోగదారుల ఫిర్యాదులపై యాపిల్ తీసుకునే చర్యలు కీలకంగా మారనున్నాయి.